కాల్పుల కలకలం : గర్భిణీ సహా ఆరుగురు మృతి

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పల కలకలం చెలరేగింది. ఇండియానా పోలీస్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో గర్భిణీతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డతో సహా గర్భిణీ స్త్రీ చనిపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.తీవ్రంగా గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మరోవైపు ఈ కాల్పులను ఇండియానాపోలిస్ మేయర్ జో హాగ్‌సెట్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని పేర్కొన్నారు .దీనిపై స్థానిక పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పారు. అటు గత దశాబ్దకాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని స్థానిక పోలీసులు వెల్లడించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి