టిక్‌టాక్‌ సింగర్‌ రాజు ఆత్మహత్య | Siddipet Tik Tok Singer Raju Self Departed | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ సింగర్‌ రాజు ఆత్మహత్య

Aug 2 2020 11:50 AM | Updated on Aug 2 2020 1:46 PM

Siddipet Tik Tok Singer Raju Self Departed - Sakshi

సాక్షి, సిద్దిపేట : టిక్‌టాక్‌ పాటలతో మంచి గుర్తింపు పొందిన సిద్దిపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని కోడూరు మండలం గంగాపూర్‌ గ్రామానికి గడ్డం రాజు వ్యవసాయం పొలం వద్ద ఆదివారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘అక్క రాఖీతో ఇంటికి వస్తే ఇక లేడని ఇక రాడాని చెప్పుమ్మ’ అనే పాటతో సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సాధించాడు. అలాంటి వ్యక్తి రాఖీ పండగ ముందు రోజు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని వివరాలను సేకరిస్తున్నారు. కాగా సింగర్‌ రాజు గతంలో పాడిన పాటు టిక్‌టాక్‌లో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. అతని ఆత్మహత్య విషయం తెలిసిన ఫాలోవర్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement