భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య | Siddipet Collector Gunman Commits Suicide After Killing His Wife And Children - Sakshi
Sakshi News home page

Siddipet Collector Gunman Suicide: భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్య

Dec 15 2023 12:19 PM | Updated on Dec 15 2023 1:27 PM

Siddipet Collector Gunman Commits Suicide - Sakshi

సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్‌.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది

సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్‌.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్‌ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. 

విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి,  తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పుల పాలై నరేష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సిద్ధిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ఏమన్నారంటే..

  • 11గంటల 15 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది
  • 2013బ్యాచ్ కి చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను కాల్చి, తనను తాను కాల్చుకొని మరణించాడు
  • కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది
  • ఆన్ డ్యూటీ లో ఉండగా ఈ ఘటన జరిగింది
  • నరేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం
  • కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాం

మృతుల వివరాలు

  • ఆకుల నరేష్, కానిస్టేబుల్, వయస్సు 35 సంవత్సరాలు, ARPC 2735, ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు.
  • ఆకుల చైతన్య, నరేష్‌ భార్య, వయస్సు 30 సంవత్సరాలు
  • ఆకుల రేవంత్, వయస్సు 6 సంవత్సరాలు, 1st క్లాస్ విద్యార్థి
  • ఆకుల రిషిత, వయస్సు 5 సంవత్సరాలు, UKG విద్యార్థిని

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement