ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎస్‌ఐ

SI Was Arrested For Demanding Rs 50,000 From  Accused In A Case - Sakshi

సాక్షి, మేడ్చల్‌ :  ఏసీబీ అధికారుల‌కు  మ‌రో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ చీటింగ్ కేసుకి సంబంధించి నిందితుడి నుంచే 50 వేల రూపాయ‌లు డిమాండ్ చేసి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు. వివ‌రాల ప్ర‌కారం.. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న 2014 బ్యాచ్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఓ కేసు విషయంలో నిందితుడి నుంచి 50వేల రూపాయ‌ల లంచం డిమాండ్ చేశారు. మొత్తానికి ఇద్దరి మ‌ధ్యా 30 వేల‌కు ఒప్పందం కుదిరింది. ఈ డ‌బ్బును ఎస్సైకి ఇస్తుండ‌గా ముందస్తు స‌మాచారం మేర‌కు పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన ఏసీబీ అధికానులు న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైతో పాటు ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ హ‌స్తం కూడా ఉండ‌టంతో ఇద్ద‌రినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top