బైక్‌పై ఫంక్షన్‌కు వెళ్తుండగా.. | RTC Bus Hits Bike 2 Deceased Chaderghat Hyderabad | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువకుల దుర్మరణం

Mar 12 2021 9:40 AM | Updated on Mar 12 2021 10:29 AM

RTC Bus Hits Bike 2 Deceased Chaderghat Hyderabad - Sakshi

చాదర్‌ఘాట్‌: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సంపత్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్‌ మలక్‌పేట్‌కు చెందిన సోహేల్‌ అహ్మద్‌ (18), ఇలాఫ్‌ ఆహ్మద్‌ (14)బుధవారం రాత్రి బైక్‌పై చంపాపేటలో ఫంక్షన్‌కు బయలుదేరారు.

మలక్‌పేట సోమల్‌ హోటల్‌ సమీపంలో వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద  పడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.  కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ పరారైనట్లు పోలీసులు తెలిపారు. బస్సును సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించామని, డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement