breaking news
old malakpet
-
బైక్‌పై ఫంక్షన్‌కు వెళ్తుండగా..
చాదర్‌ఘాట్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సంపత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ మలక్‌పేట్‌కు చెందిన సోహేల్ అహ్మద్ (18), ఇలాఫ్ ఆహ్మద్ (14)బుధవారం రాత్రి బైక్‌పై చంపాపేటలో ఫంక్షన్‌కు బయలుదేరారు. మలక్‌పేట సోమల్ హోటల్ సమీపంలో వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వేగంగా వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద పడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. బస్సును సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించామని, డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట రీపోలింగ్ ప్రారంభం
-
ఓల్డ్ మలక్‌పేటలో ముగిసిన రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట వార్డు(డివిజన్) జరిగిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్ పేపర్లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా ముద్రించడంతో రీపోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో కారు జోరే కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు: రీపోలింగ్ కట్టు దిట్టమైన భద్రత నడుమ కొనసాగుతోంది. తాజాగా ఉదయం 11 గంటలకు వరకు పోలింగ్ శాతం 13.41గా నమోదు అయింది. ఉదయం 9 గంటలకు వరకు: ఓల్డ్ మలక్‌పేట వార్డు( డివిజన్)లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 4.4 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు జరుగుతుంది. భారీ భద్రత నడుమ రీపోలింగ్ ప్రక్రియ సాగుతోంది. వార్డులో మొత్తం ఓట్లు: 54,655 పురుషులు : 27889 మహిళలు: 26763 ఇతరులు 3 పోలింగ్ కేంద్రాలు 69 విధుల్లో ఉండే మైక్రో అబ్జర్వర్లు 12 మంది. వెబ్‌కాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాలు:23 నేడు సెలవు: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలో పోలింగ్ సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతమైన ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు వర్తిసుందన్నారు. అన్ని కార్యాలయ అధిపతులు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధం ఉదయం 7 గంటలకు ఓల్డ్ మలక్ పేట్లో ప్రారంభమైన రీపోలింగ్ 69 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. పెట్రోలింగ్, పోలీస్ సిబ్బందితో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రేపటి కోసం కూడా భారీ బందోబస్తు ఉందన్నారు. 200 మీటర్ల పరిధిలో ఎవరికి అనుమతి ఉండదని,.కేవలం అనుమతి పత్రం ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉన్నట్లు తెలిపారు. 48 గంటల పాటు ర్యాలీ నిషేధించినట్లు వెల్లడించారు. ఓటర్లందరు చాలా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు
-
చిన్నారిపై దూసుకెళ్లిన బస్సు
-
దూసుకెళ్లిన బస్సు: చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ మలక్‌పేటలో శనివారం ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కనే ఉన్న మహేశ్వరీ (6) పైకి బస్సు దూసుకువెళ్లింది. దీంతో చిన్నారి మహేశ్వరి అక్కడికక్కడే మరణించింది. దాంతో భయపడిన డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు. అనంతరం ఓల్డ్ మలక్‌పేటలో రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బస్సు వివరాలు తీసుకుని యజమానికి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.