ముత్తూట్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.7 కోట్లు చోరి | Robbery Worth RS 7 Crore Gold Take Place Hosur Muthoot Branch | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.7 కోట్లు చోరి

Jan 23 2021 8:18 AM | Updated on Jan 23 2021 8:21 AM

Robbery Worth RS 7 Crore Gold Take Place Hosur Muthoot Branch - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు

హోసూరు: బెంగళూరు సమీపం లోని తమిళనాడు పట్టణం హో సూరులో భారీ బంగారం దోపిడీ జరిగింది. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్‌లోకి శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి 14 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో నింపుకుని పరారయ్యారు. విషయం తెలిసి హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు సంస్థ మేనేజర్‌ తెలిపారు. పట్టపగలే భారీ దోపిడీ జరగడం తీవ్ర కలకలం సృష్టించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement