మైనర్‌పై ఐదేళ్లుగా అత్యాచారం.. బిడ్డకు జన్మనివ్వడంతో..

Repeatedly Raped by Cousin 15 year old girl Delivers Child in Patiala - Sakshi

చండీగడ్: దేశంలో రోజురోజుకూ బాలికల మీద అత్యచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కూతురు, సొదరి వరసయ్యే చిన్నారులపై తమతమ ప్రకోపం చూపిస్తున్నారు....పంజాబ్‌లోని పాటియాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలిక ఐదేళ్లుగా అత్యాచారానికి గురైంది. మైనర్‌ బాలిక ఒక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.  వివరాలు.. బాధిత బాలిక గత ఐదేళ్లుగా పాటియాలలోని తన కజిన్ ఇంట్లో ఉంటుంది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో  నిందితుడు ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు, నేరాన్ని ఎవరికీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించాడు.

ఈ విషయం  గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం  ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె  బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె  తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top