పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు

Police Arrested Agriculture Motors Thief Karimnagar - Sakshi

జల్సాల కోసం వ్యవసాయ మోటార్ల దొంగతనం

అంతర్‌జిల్లా ముఠాను అరెస్ట్‌చేసిన పోలీసులు

ఎనిమిది మోటార్లు, ట్రాలీఆటో, కారు స్వాధీనం

వివరాలు వెల్లడించిన అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ 

సాక్షి,హుజూరాబాద్‌: పొద్దంతా వ్యవసాయ పొలాల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ వ్యవసాయ మోటార్లు ఉన్నాయి.. ఏఏ ప్రాంతాలు దొంగతనాలకు అనుకూలంగా ఉన్నాయి.. అనేది అంచనా వేసుకుంటున్నారు. చీకటిపడి, అందరూ నిద్రపోయాక తమ పనిని సులువుగా కానిచ్చేస్తారు. వ్యవసాయ బావులు, కెనాల్‌ కాలువలకు ఏర్పాటుచేసిన మోటార్లను చోరీచేసి హైదరాబాద్‌ తీసుకెళ్లి అమ్మేస్తారు.

వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటారు. ఇలా చోరీ చేసిన మోటార్లను అమ్మేందుకు తరలిస్తూ.. తని ఖీల్లో పట్టుపడిన అంతర్‌జిల్లా దొంగల ముఠాను ఇల్లందకుంట పోలీసులు అరెస్ట్‌చేయగా.. ఇందుకు సంబంధించిన వివరాలు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డితో కలిసి హుజూరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో సోమవారం వెల్లడించారు.

డీసీపీ వివరాల ప్రకారం..
 నల్గొండ జిల్లాకు చెందిన ఒర్సు మహేశ్, వరికుప్పల నరసింహ, ఒర్సు భరత్, మరో ఇద్దరు మైనర్లు కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జల్సాలకు అలవాటు పడిన వీ రు వచ్చేసొమ్ము సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లలో దొంగతనాలు చేస్తే రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని, వ్యవసాయమోటార్లు అయితే ఎలాంటి సమస్య ఉండదని భావించారు. కొద్దిరోజులుగా హుజూరాబాద్‌ ప్రాంతంలో పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రి సమయ ంలో రైతులు వ్యవసాయం నిమిత్తం ఎస్సారెస్పీ కె నాల్‌కు బిగించిన మోటార్లను దొంగలించసాగారు.

తనిఖీల్లో చిక్కి..
 హుజూరాబాద్‌ డివిజన్‌ ప్రాంతంలో ఇటీవల చోరీచేసిన మోటార్లు ఓ చోట భద్రంగా దాచారు. సోమవారం ఎనిమిది మోటార్లు అమ్మేందుకు కారు, ట్రాలీఆటోలో హైదరాబాద్‌ బయల్దేరారు. ఇదే సమయంలో ఇల్లందకుంట ఎస్సై తిరుపతి తన సిబ్బందితో కలసి మండల కేంద్రంలోని చౌరస్తాలో తనిఖీలు చేస్తున్నారు. కారు, ట్రాలీలోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో విచా రించేందుకు ప్రయత్నించగా.. పారిపోయేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహనాలు, ఎనిమిది మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే హుజూరా బాద్‌లో మూడు, ఇల్లంతకుంట ఒకటి, ఎల్కతుర్తిలో ఒక కేసు ఉందని, ఇప్పటి వరకు వీరు 38 మోటార్లు దొంగలించారని, అందరినీ రిమాండ్‌ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐలు వీరబత్తిని శ్రీనివాస్, ఎర్రళ్ల కిరణ్‌æ, సురేశ్, ఎస్సై తిరుపతి, పీసీలు మోహన్, మహేందర్, సూర్యను డీసీపీ అభినందించారు.

చదవండి: భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్‌కి పంపారు.. రెండు నెలల తర్వాత..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top