Punjagutta: వీడిన చిన్నారి హత్య మిస్టరీ.. తల్లి వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి

Panjagutta Children Murder Case: Mother Extramarital Affair Is Reason - Sakshi

 చిన్నారి హత్య కేసులో వీడిన మిస్టరీ

ప్రియుడితో కలిసి ఘాతుకం

వివాహేతర సంబంధమే కారణం

పోలీసుల ఆదుపులో నిందితులు 

సాక్షి, పంజగుట్ట: చిన్నారిని హత్యచేసి పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో మూసి ఉన్న షట్టర్‌ పక్కన పడేసి వెళ్లిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా గుర్తించారు. ప్రియుడితో కలిసి కన్న తల్లి బిడ్డను దారుణంగా కొట్టి చంపింది. మియాపూర్‌, డబీర్‌పురా చెందిన నిందితులను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శుక్రవారం హైదరాబాద్‌ తీసుకువచ్చిన పోలీసులు శనివారం అతడిని విచారించి  మీడిమా ఎదుట ప్రవేశ పెట్టారు. చిన్నారిపై మృతి కేసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ పూర్తి వివరాలను వెల్లడించారు.
చదవండిష్త్: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళకు తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కించారు.. కాసేపటికే

మియాపుర్‌కు చెందిన నిందితురాలు హీనా బేగం భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.  భిక్షాట‌న కోసం హీనా, ఖాద‌ర్ క‌లిసి బెంగ‌ళూరు, ముంబై, పుణె, జైపూర్ వంటి ప్రాంతాల్లో భిక్షాట‌న చేస్తూ జీవ‌నం గ‌డుపుతుంన్నారు. వీరితో పాటు మెహాక్‌ను కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు.. అయితే, చిన్నారి బేబీ మెహక్ బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది. నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో తమకు అడ్డు వస్తుందని మొదటి భర్తకు పుట్టిన బిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. 
చదవండి: చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..

కాగా ఈ నెల 4న ఉదయం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు నాలుగేళ్ల చిన్నారిని తీసుకువచ్చి పంజగుట్ట ద్వారకాపూరి కాలనీ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌ 1 వైపు వెళ్లే మార్గంలో ఉన్న మూసి ఉన్న దుకాణం ఎదుట పారవేసి వెళ్లారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నివేదికలో బాలిక ఊపిరితిత్తుల కింద బలమైన గాయాలు ఉండడం, మొఖంపై ఎవరో బలంగా కొడితే కమిలిపోయినట్లు ఉన్నట్లు వెల్లడి కావడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించగా  ఒక మహిళ, ఒక పురుషుడు పంజగుట్ట మాన్యావర్‌ సమీపంలోని మసీద్‌ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లి చిన్నారరి శవాన్ని షాప్‌ ఎదుట పారవేసి తిరిగి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ  గుర్తించారు. సదరు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక మహిళ, ఒక పురుషుడు నాంపల్లిలో ఆటో ఎక్కి ఇక్కడ దిగినట్లు స్పష్టం చేశాడు. నిందితులు సెల్‌ఫోన్, ఎక్కడా వాహనం వాడకపోవడంతో వారిని పట్టుకోవడం సవాల్‌గా మారింది. దీంతో కొన్ని వందల సీసీ కెమెరాల ఫీడ్‌ను తనిఖీ చేసిన 8 బృందాలు దాదాపు వారం రోజులు శ్రమించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top