ఆన్‌లైన్‌ రమ్మీ వ్యసనానికి బ్యాంకు ఉద్యోగి బలి

Online Rummy claims life of man in Tamil Nadu - Sakshi

చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ ఉచ్చులో చిక్కుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఘటన జరిగింది. కోయంబత్తూరులో నివసించే మదన్‌కుమార్‌ (28) బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసగా మారాడు. తొలుత బాగా డబ్బులు సంపాదించినప్పటికీ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఒత్తిడి తట్టుకోలేక మదన్‌ మద్యానికి అలవాటు పడ్డాడు. శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top