మీర్‌పేట్‌లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..

Mother Kills 2 Sons And Attempt To Suicide At Meerpet - Sakshi

సాక్షి, రంగారెడ్డి: మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్‌డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది.  అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట్‌లో నివాసముంటున్న శ్రీను నాయక్‌కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్‌లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top