కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో.. | Mother And Daughter Missing In Tirupati District | Sakshi
Sakshi News home page

కూరగాయల కోసం వెళ్లి.. ఇంటికి రాకపోవడంతో..

Apr 13 2022 8:37 AM | Updated on Apr 13 2022 8:37 AM

Mother And Daughter Missing In Tirupati District - Sakshi

రమ్య, బిడ్డ శ్రీ

పిచ్చాటూరు(తిరుపతి జిల్లా): మండలంలోని కీళపూడి గ్రామానికి చెందిన రమ్య(20), ఆమె కుమార్తె శ్రీ (1) అదృశ్యమయ్యారు. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం.. కీళపూడి గ్రామానికి చెందిన వేలు కుమార్తె రమ్యకు చిత్తూరు మండలం, ఓబునపల్లెకి చెందిన బాలాజీతో వివాహమైంది. వీరికి శ్రీ అనే ఏడాది పాప ఉంది. గత వారం కీళపూడిలోని అమ్మగారింటికి వచ్చిన రమ్య, సోమవారం సాయంత్రం పిచ్చాటూరు సంతలో కూరగాయల కోసం తన బిడ్డతో కలిసి వెళ్లింది.

చదవండి: Tirumala: టీడీపీ నేతలకు చేదు అనుభవం.. భక్తుల షాక్‌

రమ్య ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిస్తే ఫోన్‌ నం.9440900727కు సమాచారం అందించాలని ఎస్‌ఐ ప్రజలకు సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement