Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం | Many Died In Road accident At Nayanapalli Cross Anantapur | Sakshi
Sakshi News home page

Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

Oct 26 2024 4:10 PM | Updated on Oct 26 2024 4:46 PM

Many Died In Road accident At Nayanapalli Cross Anantapur

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్పల మండలం నాయనపల్లి క్రాస్‌ వద్ద లారీని కారు ఢీకొట్టింది. టైరు పగిలి అదుపుతప్పిన కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. అనంతపురం- కడప జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా అనంతపురం ఇస్కాన్‌ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు.

మృతుల వివరాలు...
శ్రీధర్(28)
సంతోష్ (26)
వెంకన్న (35)
ప్రసన్న (34)
వెంకీ (24)
షణ్ముఖ (30)

 

Advertisement
 
Advertisement
Advertisement