తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను..

Man kills minor childreens a day after wife lodges complaint over domestic violence - Sakshi

ప‌ట్నా: బీహార్‌లోని ప‌ట్నాలో దారుణం చోటు చేసుకుంది. త‌న‌పై  భార్య కేసు పెట్టింద‌న్న కోపంతో కన్న పిల్ల‌ల‌ను దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి. ప‌ట్నా రూర‌ల్ జిల్లా క‌న్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన క‌మ‌ల్‌దేవ్‌, వీణా దేవి అనే మ‌హిళ‌కు  కొన్నేళ్ల కిందట  వివాహం జరిగింది. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్ద‌రు సంతానం ఉన్నారు. కాగా,వీణా దేవి ప‌లువురితో అక్ర‌మ‌సంబంధం క‌లిగి ఉంద‌ని, ఆమెతో క‌మ‌ల్‌దేవ్ త‌ర‌చూ గొడ‌వపెట్టుకునేవాడు.  

వారిద్ద‌రి మ‌ధ్య తరచూ గ‌త కొంత‌కాలంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా త‌ప్పించుకున్న‌ ఆమె పిల్ల‌ల‌ను ఇంట్లో  వ‌దిలేసి త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. త‌ల్లిదండ్రులతో క‌లిసి తన భర్తపై  గృహ‌హింస‌, అద‌న‌పు క‌ట్నం వేధిస్తున్నాడని  పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో భార్య‌పై కోపంతో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున నిద్ర‌లో ఉన్న చిన్నారుల త‌ల‌పై బ‌లంగా కొట్టి చంపేశాడు.

అనంత‌రం ఉద‌యం 5 గంట‌ల ప్రాంతంలో పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి  వెళ్లి చూడగా  అంకిత్,  అలీషా మృతదేహాలు వారు నిద్రిస్తున్న మంచం మీద రక్తపు మడుగులో పక్కపక్కనే పడి ఉన్నాయి.త‌న భార్య ప‌లువురితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని, ఆ పిల్ల‌లు త‌న వ‌ల్ల క‌లిగిన‌ సంతానం కాద‌ని చెబుతూ మాన‌సికంగా వేదించేద‌ని ఆరోపించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

(చదవండి: కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య)

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top