నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకుంటా అంటూ.. | Man Harassed And Assassinated Girl By Stabbing Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకం: తాళి కట్టించుకుంటావా లేదా అంటూ

Apr 6 2021 9:04 AM | Updated on Apr 6 2021 11:14 AM

Man Harassed And Assassinated Girl By Stabbing Karnataka - Sakshi

కావ్య కాలేజీకి వెళుతున్న సమయంలో అడ్డుకుని నిన్ను ఎలాగైనా నా దానిని చేసుకుంటానని తాళి కట్టబోయాడు.

తుమకూరు: కర్ణాటకలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిని కత్తితో పొడిచి చంపాడు. జిల్లాలోని శిరా తాలూకాలోని దొడ్డగుళలో ఈ ఘోరం చోటుచేసుకుంది. హతురాలు పొరుగు గ్రామమైన రత్నసంద్ర గొల్లరహట్టికి చెందిన పీయూసీ విద్యార్థిని కావ్య(20). నిందితుడు ఈరణ్ణ (21) పరారీలో ఉన్నాడు.  

కాలేజీకి వెళ్తుండగా అడ్డుకుని..  
కళ్లంబెళ్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈరణ్ణ కావ్యను ప్రేమించాలంటూ వెంటపడేవాడు. నిన్ను ప్రేమించనని ఆమె అనేకసార్లు చెప్పేసింది. దాంతో యువతిపై పగను పెంచుకున్నాడు. సోమవారం ఉదయం కావ్య కాలేజీకి వెళుతున్న సమయంలో అడ్డుకుని.. ‘‘నిన్ను ఎలాగైనా నా దానిని చేసుకుంటా’’ అని తాళి కట్టబోయాడు. యువతి అడ్డుకోవడంతో కత్తి తీసి దాడికి యత్నించాడు. యువతి పారిపోతున్నా వెంటాడి కత్తితో పొడిచిచంపాడు. ఇది చూసిన సహచర విద్యార్థులు కావ్య కుటుంబ సభ్యులతో పాటు పొలీసులకు సమాచారం ఇచ్చారు. పొలీసులు యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈరణ్ణ పరారీలో ఉన్నాడు.  

చదవండి:  ప్రియురాలిని చంపిన ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. ఆ తర్వాత
కాళ్లపారాణి ఆరకముందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement