భార్యలకు విడాకులు.. మ్యాట్రిమోనిలో మరో యువతితో | Man Divorced 2 Wives After Trying Marry Young Woman In Hyderabad | Sakshi
Sakshi News home page

భార్యలకు విడాకులు.. మ్యాట్రిమోనిలో మరో యువతితో

Dec 18 2020 8:01 AM | Updated on Dec 18 2020 8:17 AM

Man Divorced 2 Wives After Trying Marry Young Woman In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: యువతికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్‌కు చెందిన సాల్మన్‌రాజు (42) విద్యుత్‌శాఖలో పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్ది నెలల క్రితం   మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా సికింద్రాబాద్‌ అంబర్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.  పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించాడు. గతంలో రెండుమార్లు సాల్మన్‌రాజుకు వివాహమైందని తెలుసుకున్న యువతి చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు సాల్మన్‌రాజును గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement