సునీత పేరుతో మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు | Man Cheated One Crore And 70 Lakhs Rupees Name Of SInger Sunitha | Sakshi
Sakshi News home page

సింగర్‌ సునీత పేరుతో బయటపడ్డ మరో మోసం

Aug 12 2020 1:34 PM | Updated on Aug 12 2020 2:02 PM

Man Cheated One Crore And 70 Lakhs Rupees Name Of SInger Sunitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్ర‌ముఖ సింగర్ సునీత పేరు చెప్పుకొని మోసం చేసిన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆమె పేరు చెప్పుకొని కొందరు కేటుగాళ్లు ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 1.70 కోట్లు కొట్టేశారు. ఇప్పటికే సునీత మేనల్లుడిని అని చెప్పుకుంటూ మోసానికి పాల్పడిన చైతన్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అతని చేతిలో మోససోయిన ఓ మహిళ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 1.70 కోట్ల మోసం బయటపడింది.
(చదవండి : సింగర్‌ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్‌)


కొత్తపేటకు చెందిన ఓ మహిళ సింగర్‌సునీతకు వీరాభిమాని. దీన్ని ఆసరాగా చేసుకున్న చైతన్య అనే వ్యక్తి సునీత్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఇదేనని ఓ నంబర్‌ ఇచ్చాడు. అలా ఆమెను నమ్మించాడు. ఇలా కొద్ది రోజులు గడిశాక.. ఒకరోజు కేరళలోని 'ఆనంద చేర్లాయం ట్రస్ట్‌'లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో .. బాధితురాలు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి పలు దఫాలుగా రూ.1.7 కోట్లు బాధితురాలి నుండి వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించే వారు కానీ ఎప్పుడూ వీడియో కాల్‌ మాట్లాడేవారు కాదు. దీంతో అనుమానం వచ్చి బాధితురాలు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చైతన్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. 
(చదవండి :ఆ పుకార్లు నమ్మకండి: సంజయ్‌దత్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement