ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి.. | Man Attacked With Sword At Mumbai Over Pork Trade Dispute | Sakshi
Sakshi News home page

ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..

Dec 21 2022 3:06 PM | Updated on Dec 21 2022 3:06 PM

Man Attacked With Sword At Mumbai Over Pork Trade Dispute - Sakshi

ముంబై: ముంబైలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఒక సముహం ఒక వ్యక్తి కారుని ఢీ కొట్టి, అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో ఒక పిక్‌ అప్‌ వ్యాన్‌ మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు కనిపించింది.

ఆ తర్వాత ఒక గుంపు వాహనంలోని ఓ వ్యక్తిని బయటకు లాగి కత్తితో పదేపదే దాడి చేసి గాల్లో కత్తిని ఊపుతూ.. అక్కడ ఉన్న వారందర్నీ భయబ్రాంతులకు గురి చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని ఎవరూ కాపడే ప్రయత్నం చేయనీయకుండా ఆ దుండగులు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాడికి గురైన వ్యక్తిని హర్జిత్‌సింగ్‌గా గుర్తించారు పోలీసులు. నిందితులు దాడి అనంతరం ఆ వ్యక్తిని కిడ్నాప్‌​ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కత్తిని, ఆ కారుని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం పంది మాంస వ్యాపారంతో ముడిపడి ఉండవచ్చని అన్నారు. వారంతా పందిమాంస వ్యాపారులని చెప్పారు. ఐతే అదే వాహనంలోని ఇతర వ్యక్తులపై దుండగు దాడి జరగనట్లు సీసీటీవీ విజ్యువల్స్‌ చూపిస్తున్నాయని చెప్పారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: షాకింగ్‌ వీడియో: ఆడుకుంటూ బావిలో పడ్డ బాలుడు.. మూడు నిమిషాల్లోనే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement