అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చేశాడు  | Man Assassinated His Friend Like Forest Pig In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అడవిపంది అనుకొని స్నేహితున్ని కాల్చేశాడు 

Feb 13 2021 7:14 AM | Updated on Feb 13 2021 2:09 PM

Man Assassinated His Friend Like Forest Pig In Tamil Nadu - Sakshi

ఫైల్‌ ఫోటో

తిరువొత్తియూరు: వేటకు వెళ్లి అడవిపంది అనుకుని స్నేహితున్ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చేసాడు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన పసుప్ప (40). ఇతను,  మిత్రుడు నాగరాజు (27)తో కలిసి గురువారం రాత్రి అటవీ ప్రాంతానికి ఇద్దరు నాటు తుపాకీలతో వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లారు.

అర్ధరాత్రి నాగరాజు వెళ్లిన ప్రాంతంలో శబ్దం రావడంతో అడవిపంది అనుకుని తుపాకీతో కాల్చాడు. అక్కడికి వెళ్లి చూడగా తుపాకీ తూట దూసుకెళ్లి పసుప్ప మృతిచెంది వున్నాడు. ఇది చూసి నాగరాజు అక్కడి నుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొందరు పసుప్ప మృతిచెంది వుండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు నాగరాజు కోసం గాలిస్తున్నారు.  

చదవండి: విహారం.. విషాదం.. ప్రధాని దిగ్భ్రాంతి
చదవండి: కన్నిబల్‌: ఫ్రెండ్స్‌ని చంపి తిన్నాడు..
చదవండి: ఎంత పని చేశావు.. అమ్మ

Advertisement
 
Advertisement
Advertisement