గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్‌లు చోరీ

గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్‌లు చోరీ - Sakshi

ముంబై: గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయాలని ఓ యువకుడు దొంగగా మారాడు. ఖరీదైన బైకులు దొంగతనం చేశాడు. మొత్తం 13 ద్విచక్ర వహనాలకు తస్కరించి కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుడి పేరు శుభం భాస్కర్ పవార్. ఓ బైక్‌ను దొంగిలించిన ఇతడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. 

తాను మొత్తం 13 బైక్‌లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు.  కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ బైక్‌ల విలువ రూ.16లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు చెప్పారు.
చదవండి: లఖీంపూర్‌ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top