బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసిన మరో యువకుడు

Khammam: Molestation On Minor Girl, Child Died After Fell Into Water Tank - Sakshi

ఇద్దరిపై పోక్సో కేసు నమోదు

సాక్షి, అశ్వారావుపేట:  మైనర్‌పై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడగా, మరో యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట ఎస్సై చల్లా అరుణ బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) గత నెల 30వ తేదీన చర్చికి వెళ్లి రాత్రి 10గంటల సమయంలో తిరిగి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. అదే గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ఆమెను బలవంతంగా సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చదవండి: వివాహేతర సంబంధం.. సమీప బంధువుని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి..

ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, మైనర్‌ బాలికపై లైంగిక దాడి పాల్పడుతున్న సమయంలో అదే గ్రామానికి మరో యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు బుధవారం రాత్రి చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు చేయగా, ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 
చదవండి: బంజారాహిల్స్‌లో దారుణం బాలికను పిన్ని ఇంటికి తీసుకెళ్లి..


రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
జూలూరుపాడు:
నీటి తొట్టిలో పడి 13 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భీమ్లాతండాకు చెందిన గుగులోత్‌ శ్రీనివాసరావు, హరిత దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు చేతన్‌ భార్గవ్, చిన్న కుమారుడు రిషిత్‌ నాయక్‌(13 నెలలు)లను ఇంట్లో నాయనమ్మ దేవి వద్ద ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. నాయనమ్మ వద్ద ఉన్న రిషిత్‌ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ప్రాంగణంలో ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు.

ఇంటి పనిలో నిమగ్నమైన నాయనమ్మ దేవి, పెద్దమ్మ దుర్గ కొంత సేపటికి తర్వాత పిల్లవాడు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ వెతకగా నీటితొట్టిలో పడి ఉన్నాడు. బయటకు తీసి స్థానిక వైద్యుడి వద్ద తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఇంటికొచ్చిన రిషిత్‌ తల్లిదండ్రులు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రులు, కుటుంబీకులు విలపిస్తున్న తీరు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని ఎంపీపీ లావుడ్యా సోని, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మి దంపతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు రాంశెట్టి రాంబాబులు సందర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ట్రైనీ ఎస్సై కార్తీక్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి, వివరాలు సేకరించారు. చోరీ జరిగిన వైన్స్‌ ఇదే...  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top