లైంగిక దాడి: ఫ్లైట్ లెఫ్టినెంట్‌ అరెస్ట్ | IAF Officer Arrested Over Molestation Assault Complaint In Coimbatore | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి: ఫ్లైట్ లెఫ్టినెంట్‌ అరెస్ట్

Sep 27 2021 12:59 PM | Updated on Sep 27 2021 12:59 PM

IAF Officer Arrested Over Molestation Assault Complaint In Coimbatore - Sakshi

చెన్నై: తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా అధికారిణిని ఇటీవల ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు అడుతున్న క్రమంలో గాయపడ్డారు. దీంతో ఆమె గాయం తగ్గడం కోసం మందులు వేసుకొని  తన గదిలో నిద్రపోయారు. అయితే ఆమె నిద్ర లేచి చూశాక.. తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించించారు. ఈ ఘటనపై ఆమె రెండు వారాల క్రింతం తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

కానీ, వారు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్‌ ఛత్తీస్‌ఘ‌ర్‌ రాష్టానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement