కాల్‌ లిఫ్ట్‌ చేయగానే నగ్న వీడియో.. అప్పుడే అసలు కథ మొదలైంది..

Hyderabad  Software Engineer Lost 29 lakhs Over Sexstation - Sakshi

రూ.29 లక్షలు సమర్పించుకున్న సిటీ టెకీ

కాల్‌ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని బెదిరింపులు

భయపడి విడతల వారీగా డబ్బు పంపిన బాధితుడు

రాజస్తాన్‌ గ్యాంగ్‌ పనేనని పోలీసుల నిర్ధారణ

సాక్షి, హైదరాబాద్‌: అందివచ్చే ప్రతీ ఒక్క అవకాశాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు సైబర్‌ నేరస్తులు. ఏమ్రాతం అలసత్వంగా ఉన్నా లక్షలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా హైటెక్‌సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్‌ ఫొటోతో ఫ్రెండ్‌ రెక్వెస్ట్‌ వచ్చింది. వచ్చిందే తడువు క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా యాక్సెప్ట్‌ చేశాడు. కాసేపటికి న్యూడ్‌ వీడియో కాల్‌ అంటూ ఎఫ్‌బీలో మెసేజ్‌ పంపించింది.

దీంతో సరేనని.. ఇతనూ రెడీ అయ్యాడు. కాల్‌ లిఫ్ట్‌ చేయగానే ఓ అమ్మాయి నగ్న వీడియో ప్లే అయింది. అయితే  వాస్తవానికి అది ప్రత్యక్ష వీడియో కాదు.. రికార్డెడ్‌ వీడియో. అటువైపు నుంచి ఆడ గొంతుతో ఈ టెకీని కూడా బట్టలు విప్పమని కోరింది. దీంతో ఇతనూ ఒంటిపై దుస్తులు తీసేశాడు. ఈ తతంగాన్నంతా అటువైపు నుంచి సైబర్‌ నేరస్తులు వీడియో తీశారు.
చదవండి: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్‌ బాలికపై..

ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను..
ఇకడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలైంది! వీడియో కాల్‌ పూర్తయ్యాక.. కాసేపటికి సదరు ఐటీ ఉద్యోగికి ఫోన్‌ వచ్చింది. ‘ఢిల్లీ ఏసీపీని మాట్లాడుతున్నాను. మీతో న్యూడ్‌ వీడియో కాల్‌ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మీపైన ఢిల్లీలో కేసు నమోదయింది. అరెస్ట్‌ చేస్తామని’ బెదిరించారు. అమ్మాయి సెల్‌ఫోన్‌ వీడియోలను సంబంధించిన రికార్డ్‌ అంతా రికవరీ చేశామని తెలిపారు. పోలీస్‌ అనగానే టెకీ భయపడిపోయాడు. ఇతని వీడియో ఇతనికే పంపడంతో నిజమేనని నమ్మేశాడు.

కేసు, అరెస్ట్‌ గట్రా లేకుండా ఉండాలంటే కొందరు అధికారులను మ్యానేజ్‌ చేయాలని, కొంత డబ్బు పంపిచమని కోరారు. సరేనని..గత నెల 7వ తేదీ నుంచి 20 రోజుల పాటూ విడతల వారీగా రూ.29 లక్షలు ఆన్‌లైన్‌లో సమర్పించుకున్నాడు. అయినా వదిలిపెట్టకుండా పదే పదే బెదిరిస్తుండటంతో తప్పని పరిస్థితులతో గురువారం సైబరాబాద్‌ సైబర్‌ క్రై మ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు గుట్టరట్టయింది. ఇదంతా రాజస్తాన్‌ చెందిన సైబర్‌ ముఠా పనేనని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. 
చదవండి: ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..

సిగ్గుపడి రిపోర్ట్‌ చేయడం లేదు 
ఇప్పటివరకు నగ్న వీడియో కాల్స్‌ ఘటనలపై 6–7 కేసులు నమోదయ్యాయి. సెక్ట్సార్షన్‌ అని పిలిచే ఈ తరహా బాధితులు చాలా మందే ఉంటారు కానీ, చెప్పుకోవటానికి సిగ్గుపడి ముందుకు రావటం లేదు. పోలీసులు ఏమంటారోనని భయపడుతుంటారు. ఇదే సైబర్‌ నేరస్తులకు ఆయుధంగా మారుతోంది. అపరిచితులతో ఫోన్‌లో సంభాషించొద్దు. అమ్మాయితో నగ్న వీడియో కాల్స్‌ అనగానే నమ్మొద్దు. 
– జీ. శ్రీధర్, ఏసీపీ, సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top