లోను కోసం వెళితే.. అసలు విషయం తెలిసి షాక్‌ అయ్యి..

Hyderabad: Man Held Forgery Take Loan Money From Banks - Sakshi

సాక్షి,హిమాయత్‌నగర్‌: అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో..లోను తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన నగర వాసికి దిమ్మతిరిగే నిజం తెలిసింది. మీ పేరుపై, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్‌పై ఆల్రెడీ లోను ఉంది మళ్లీ ఇంకొకటి ఎలా ఇస్తారనడంతో..నగర వాసికి తేరుకోవడానికి గంట సమయం పట్టింది. గుర్తు తెలియని వ్యక్తుల తన పేరుతో రూ. 11.70 లక్షల రుణం పొందారంటూ.. తనకు న్యాయం చేయాలని బుధవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు చాదర్‌ఘట్‌ వాసి రాము.

వ్యక్తిగతంగా డబ్బు అవసరం ఉండటంతో.. రాము చాదర్‌ఘట్‌లోని ఎస్‌బీఐకి వెళ్లాడు. పాన్‌కార్డ్, ఇంటిపత్రాలు, తదితర డాక్యుమెంట్స్‌ను లోను సెక్షన్‌ వారికి ఇచ్చాడు. వారి వెరిఫికేషన్‌లో గత ఏడాది లోను తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం రాముకు లోను సెక్షన్‌ వాళ్లు చెప్పడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన ప్రమేయం లేకుండా అంత డబ్బు లోను ఎవరు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఆ«ధారాలతో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top