ఢిల్లీలో దారుణం భార్యా పిల్లలను చంపేసి తను కూడా.. | Delhi Man Commits Suicide After Killing Wife kids | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దారుణం: మూసి ఉన్న గదిలో మృతదేహాలు

Apr 1 2021 2:20 PM | Updated on Apr 1 2021 2:54 PM

Delhi Man Commits Suicide After Killing Wife kids - Sakshi

దేశ రాజధాని నగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాపిల్లలను చంపి, తను కూడా

సాక్షి ,న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఒక ఇంటిలో నాలుగు మృతదేహాలు కలకలం రేపాయి. ఎంత కష్టం వచ్చిందో గానీ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తరువాత  భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ సమీపాన రోహిణిలోని నాహరాపూర్‌లో జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ధీరజ్‌ యాదవ్‌ బస్‌ డ్రైవర్‌గా ఢిల్లీ రవాణా సంస్థలో పని చేస్తున్నట్లు గుర్తించారు. ముందు తన భార్యా పిల్లలను హత్య చేసి తరువాత ధీరజ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా లేదా అప్పల బాధ భరించలేక ఈ దారణానికి పాల్పడి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ( చదవండి: ఆగ్రాలో దారుణం: భర్త కళ్ల ముందే భార్యను..

Advertisement
 
Advertisement
Advertisement