ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. న్యూస్‌ చానెల్‌ అధికారి అరెస్ట్‌

Delhi excise scam: CBI arrests news channel executive - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తాజాగా మరొకరిని అరెస్ట్‌ చేసింది. ‘ఇండియా ఏహెడ్‌’ న్యూస్‌ చానెల్‌ కమర్షియల్‌ హెడ్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ అర్వింద్‌ కుమార్‌ జోషిని అదుపులోకి తీసుకుంది.

2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌ ప్రచార బాధ్యతలను చేపట్టిన చారియెట్‌ మీడియా సంస్థకు ఈయన హవాలా మార్గంలో రూ.17 కోట్లను బదిలీ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వాట్సాప్‌ చాటింగ్, హవాలా ఆపరేటర్ల రికార్డులు పరిశీలించిన తర్వాత జోషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. చారియెట్‌ మీడియా యజమాని రాజేశ్‌ జోషిని ఫిబ్రవరిలోనే ఈడీ అదుపులోకి తీసుకుంది. అయితే, సరైన ఆధారాలను సమర్పించలేదంటూ మే 6న ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిలిచ్చింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top