DCP Janaki Explain Malkajgiri Boy Kidnapping Case Details - Sakshi
Sakshi News home page

మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారనుకోలేదు: బాలుడి తండ్రి ఆవేదన

Published Sat, Jun 17 2023 6:18 PM

DCP Janaki Explain Malkajgiri Boy Kidnapping Case Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్కాజ్‌గిరి బాలుడి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్‌ చేశారు. బాలుడిని కిడ్నాప్‌ చేసి రూ. 2కోట్లు డిమాండ్‌ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్‌ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. 

కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్‌ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్‌ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్‌ చేశారు. 

రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్‌ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్‌ చేశారు. బాలుడిని కిడ్నాప్‌ చేసి రూ.2కోట్లు డిమాండ్‌ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్‌ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్‌ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. 

మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్‌ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్‌ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు

Advertisement
 
Advertisement
 
Advertisement