పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు 

Complaint about stolen votes by TDP in Parchur - Sakshi

సమగ్ర విచారణ జరిపించాలన్న ఆమంచి

 సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుం­చి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధి­కారి ముఖేష్కుమార్‌మీనాను కలిసి లిఖితపూ­ర్వ­కంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమం­చి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూ­డునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్‌ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్‌ కేసు పెట్టారన్నారు.

అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగా­నే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్‌ఓ ఆఫీస్‌ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్ప­టి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీ­తో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు.

వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొల­గించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అ­ప్ర­జాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జ­రు­­గు­తోందని వివరించారు. మార్టూరు ప్రస్తు­త ఏఈఆర్‌ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధి­కా­రి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top