ప్రియురాలి మరణంతో కలతచెంది..

Boy Committed Suicide In Dubai After Girlfriend - Sakshi

సెల్ఫీ వీడియో అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు

సాక్షి, జగిత్యాల: ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కలతచెందిన ఓ యువకు డు శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరివేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మానాల లస్మయ్య–అమృతవ్వ దంపతుల మూడో కుమారుడు రాకేశ్‌ (21), అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉపాధి నిమిత్తం రాకేశ్‌ రెండేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారనే కారణంతో రాకేశ్‌ ప్రేమించిన యువతి (21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం తెలిసిన రాకేశ్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దుబాయి క్యాంపులోని గదిలో శనివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు రాకేశ్‌ సెల్ఫీ వీడియో తీస్తూ ‘కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నాం. ఈ రోజు నా నుంచి దూరమయ్యింది. అమ్మాయి లేని జీవితం నాకొద్దు. బై మమ్మీ ఐ మిస్‌ యూ’అంటూ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు దుబాయి వెళ్లి తమ బతుకులు మార్చుతాడనుకుంటే తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top