అమెరికాలో ఖమ్మం యువకుడిపై హత్యాయత్నం

assassination attempt on Khammam man in America - Sakshi

జిమ్‌ నుంచి వస్తుండగా కత్తితో దాడి చేసిన దుండగుడు 

తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఖమ్మంక్రైం: అమెరికాలోని చికాగోకు ఉన్నత విద్య నిమిత్తం వెళ్లిన ఓ భారతీయ యువకుడిపై గుర్తుతెలియ ని దుండగుడు హత్యాయత్నం చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ చికాగోలో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు.

ఈ నెల 29న జిమ్‌ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్‌ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల  సమాచారంతో పోలీసులు వచ్చి  ఆస్ప త్రికి తరలించారు. అయితే ఆయన పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివ ర్ధన్‌ ఫోన్‌ చేసి వరుణ్‌ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు ఆండ్రేడ్‌ జోర్డాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top