అనుమానాస్పద స్థితిలో ఎయిర్ హోస్టెస్ మృతి | Air Hostess Found Dead In Plush At Mumbai Flat With Her Throat Slit - Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో ముంబై ఎయిర్ హోస్టెస్ మృతి

Published Mon, Sep 4 2023 2:35 PM

Air Hostess Found Dead At Plush Mumbai Flat With Her Throat Slit - Sakshi

ముంబై : ఎయిరిండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే అంధేరీలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గొంతుపై ఎవరో కత్తితో కోసిన గుర్తు ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు.   

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపా ఓగ్రే (25) ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ ట్రైనీగా విధుల్లో చేరారు. ఇదే ఏడాది ఏప్రిల్లో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ముంబై మకాం కూడా మార్చారు. అంధేరీ హౌసింగ్ సొసైటీలో ఒక ఫ్లాట్ తీసుకుని తన సోదరితో కలిసి నివసిస్తున్నారు. వీరితోపాటు రూపా బాయ్‌ఫ్రెండ్ కూడా ఇదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే కొద్దీ రోజుల క్రితమే అతను తన సొంతూరు వెళ్లాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి గొంతుపై కత్తితో కోసిన గాటు ఉందని.. అంధేరీ పోలీసులు బృందాలుగా విడిపోయి హంతకుల గురించి గాలిస్తున్నట్లు తెలిపారు. విచారణ నిమిత్తం ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నామని హౌసింగ్ సొసైటీలోని సెక్యూరిటీ కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రూప ఓగ్రే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం ఆమె హ్యండిల్స్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. 

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

Advertisement
 
Advertisement