బాలికపై సామూహిక అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి

17 Year Old Girl Dies Two Days After Being Gang Raped in UPs Hamirpur - Sakshi

ఘటనపై ఫిర్యాదు చేయని బాధితురాలి పేరేంట్స్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం​ అత్యాచారానికి గురైన బాలిక చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. వివరాల ప్రకారం..యూపీలోని హమీర్‌పూర్‌ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆసుపత్రికి తరలించే నాటికి ఆమె పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో బుధవారం​ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆమె చనిపోయిన తర్వాతే విషయం తెలిసిందని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ రావాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తమ కుమర్తెపై ఐదుగురు వ్యక్తులు సోమవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి మీడియాతో వాపోయాడు. నిందితుల నుంచి ప్రాణహాని ఉంటుందేమోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపాడు. 

చదవండి : (బస్సులో పరిచయం, విటమిన్‌ ట్యాబ్లెట్లు అని నిద్రమాత్రలు)
(టీ చేయను అనడం భర్తను రెచ్చగొట్టడం కాదు: కోర్టు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top