చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని పలు డివిజన్లకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈమేరకు వారిని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వీరిలో మాజీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, కాపు నాయకుడు మధుకుమార్, 44వ డివిజన్కు చెందిన టీడీపీ మైనార్టీ నాయకులు నూర్మహమ్మద్, 14 డివిజన్ పరంగా మణి, నాగరాజ్, 49వ డివిజన్ నుంచి ఆర్ముగం ఉన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు అంజలిరెడ్డి, నాయకులు పిచ్చాండి, హరీషారెడ్డి పాల్గొన్నారు.


