ఆలయ అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి రూ. 10 లక్షల విరాళం

Oct 16 2026 7:17 AM | Updated on Oct 16 2026 7:17 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కాణిపాకం: కాణి పాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాభివృద్ధికి హోసూర్‌ నివాసి ఈవో ధనుష్‌ నాయుడు, వారి కుటుంబ సభ్యులు రూ. 10 లక్షలు చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు. దాతలకు ఆలయ సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ నాయుడు ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

కల్వర్టును ఢీకొన్న కారు

– ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

పెద్దపంజాణి: కారు కల్వర్టును డీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలోని పుంగనూరు–పలమనేరు హైవేలోని లింగాపురం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు. కదిరికి చెందిన మహబూబ్‌ బాషా కుమారుడు సాధిక్‌(27) భార్య నఫీజ్‌, స్నేహితుడు అజర్‌ దంపతులతో కలసి ఏపీ 02–ఏకె 8388 కారులో కదిరి నుండి చిత్తూరులో ని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో కారును నడుపుతున్న సాధిక్‌ అదుపు చేయలేక లింగాపురం సమీపంలో కల్వర్టును ఢీకొని అక్కిడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వీరిని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పెద్దపంజాణి పోళీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ఆయనకు నిండు నూరేళ్లు!

నగరి: వయసు ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ నిండు నూరేళ్లు పూర్తిచేసుకున్న నగరి మండ లం వీకేఆర్‌పురానికి చెందిన రామచంద్ర నాయు డు జన్మదిన వేడుకలు గురువారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక అశ్విని ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలు ఆత్మీయతకు, కుటుంబ అనుబంధాలకు అద్దం పట్టాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై రామచంద్ర నాయుడుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో ఆయనను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుంటూ శతవసంతాలు పూర్తి చేసుకున్న పెద్దాయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీనగర్‌లో ‘కాశ్మీర్‌ మారథాన్‌–2026’

– జిల్లా రన్నర్లు, అథ్లెట్‌లకు ఆహ్వానం!

చిత్తూరు కలెక్టరేట్‌ : జమ్మూ, కాశ్మీర్‌ ప్రభుత్వం ఫిట్‌నెస్‌, క్రీడా పర్యాటకం, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జమ్మూ –కాశ్మీర్‌లోని శ్రీనగర్‌ వేదికగా కాశ్మీర్‌ మారథాన్‌–2026 ను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఉదయభాస్కర్‌ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సూచనల మేరకు ప్రతిష్టాత్మక మారథాన్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారన్నారు. జిల్లాలో ఆసక్తి ఉన్న అథ్లెట్లు, రన్నర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్లు, క్రీడా సిబ్బంది, ఆసక్తిగల అధికారులను ఈ మారథాన్‌కు ఆహ్వానించారన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలకు ఫుల్‌ మారథాన్‌ మొదటి విజేతకు రూ.25 లక్షలు, హాఫ్‌ మారథాన్‌ పురుష, మహిళా విభాగాల్లో విజేతలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు www.kashmirma rathon.jk.gov.in వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement