పలమనేరు: పట్టణంలోని అన్నాక్యాంటీన్ ఎదురుగా రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇతను పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీకి చెందిన మార్కొండ (55)గా స్థాని కులు గుర్తించారు. తలకు దెబ్బ తగిలి మృతి చెంది ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
బంగారుపాళెం: కుటుంబ కలహాల కారణంగా ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్‌దావూద్‌సాహెబ్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని బొమ్మాయిపల్లె దళితవాడలో నివాసముంటున్న అశోక్ కుమారుడు ఉమాపతి(40)కి వివాహమైంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
పలువురికి పూలే అవార్డులు
పలమనేరు: పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మందికి జ్యోతీరావు పూలే అవార్డులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధన విభాగాల్లో సేవలందించిన వారికి అవార్డులు దక్కాయి. ఇందులో నిర్వాహకులు పూసల రవి తదితరులు పాల్గొన్నారు.
కారును ఢీకొన్న ఐచర్ వాహనం
గంగవరం: మండలంలోని బైపాస్ రోడ్డులో వెళ్తున్న కారును ఆదివారం ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. పోలీసుల కథనం మేరకు.. కారు బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళుతోంది. మండలంలోని బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన ఐచర్ వాహనం కారుని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారుని ఢీకొట్టిన తర్వాత ఐచర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్టు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయాభివృద్ధికి విరాళం
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండల కేంద్రంలోని అంకాళ పరమేశ్వరి ఆలయ ఉత్సవాల్లో రాష్ట్ర మేధావుల ఐక్య వేదిక కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి తన ఉదారత చాటుకున్నారు. ఈ ఉత్సవాలకు ఆయన రూ.లక్ష విరాళమిచ్చారు. ఆయనకు పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయనను గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, లోకకళ్యాణం కోసం, గ్రామ ప్రజల క్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


