జ్యేష్టాభిషేకం
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. అనంతరం స్వామి వారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం జ్యేష్టాభిషేకం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాలతో స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా ఉంచేందుకు 1990 నుంచి ఈ ఉత్సవాన్ని చేపడుతున్నారు.


