● విధుల్లో జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్‌స్పెక్టర్ అలసత్వం ● సమర్థులను నియమించాలని సీఈవోకు కలెక్టర్ లేఖ
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి సొంత జిల్లాగా ఎంతో ప్రాధాన్యత కలిగిన చిత్తూరులోనే జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తుల సంరక్షణ, భూ వివాదాల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. జిల్లాలో వక్ఫ్‌బోర్డు సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూములు, పరిపాలనా సమస్యలు పెండింగ్‌లో పడిపోతున్నాయి. దీనిపై స్థానిక సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ రియాజ్ ఖాన్ స్థానంలో తక్షణమే మరొక సమర్థవంతమైన అధికారిని నియమించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్‌సీపీలోకి
ముస్లిం యువనేత
పలమనేరు: పట్టణానికి చెందిన సైఫ్ అనే యువనేత శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరా రు. ఆయన మాట్లాడుతూ పార్టీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. అతనికి పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఉత్సాహంగా పార్టీలోకి రావాలని సూచించారు.


