చిత్తూరు అర్బన్: శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎక్కడా రాజీ పడొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఆయన శుక్రవారం అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ షీమోషీతో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులతో చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ధైర్య–స్పర్శ, మాదకద్రవ్యాల నిర్మూలనపై చేపడుతున్న కార్యక్రమా లు, డ్రోన్ల వినియోగం, మహిళలు–పిల్లల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ తుషార్ డూడీ వివరించారు. డీజీపీ మాట్లాడుతూ డ్రోన్ ఆధారిత ఆధునిక పోలీసింగ్, కమాండ్ కంట్రోల్ కేంద్రంతో పర్యవేక్షణ వ్యవస్థ, సైబర్–సోషల్ మీడియా పర్యవేక్షణ పనితీరుపై చర్చించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడానికి పోలీసులు ప్రయ త్నించాలన్నారు. ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
టమాట ధరలు పతనం
వి.కోట: వి.కోట మార్కెట్‌లో శుక్రవారం ట మాటా ధరలు భారీగా పతనమయ్యాయి. 18 కిలోల బా క్సు రూ.30 నుంచి అత్యధికంగా రూ.200 పలకింది. దీంతో కాయలు కోసేందుకు కూలీలు, మార్కెట్‌కు తరలించే ఆటో బడుగలు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా 18 కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.250 వరకు ధరలు పలుకుతున్నాయి. దిగుబడి ఎక్కువగా ఉండడం, ఇతర మార్కెట్లకు అధికంగా సరుకు రావడంతో ధరలు పతనమైనట్టు కమిషన్ మండీ వ్యాపారులు చెబుతున్నారు.


