కాయలన్నీ కుళ్లిపోతున్నాయి | - | Sakshi
Sakshi News home page

కాయలన్నీ కుళ్లిపోతున్నాయి

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

గుడిపాల కొత్తపల్లి వద్ద అన్‌లోడింగ్‌కు నా లుగు రోజులు అవుతోంది. కాయలన్నీ కుళ్లిపోతున్నాయి. ఈ కాయలన్నీ రోడ్డుపైనా పడేస్తున్నాం. కాయల అన్‌లోడింగ్‌కు గుంపులు గుంపులుగా వదిలేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది.

– శ్రీధర్‌రెడ్డి, తాళంబేడు, చిత్తూరు మండలం

వరుసగా పంపిస్తే కదా?

గుడిపాలకు కాయలు తొలుకొచ్చి మూడు, నాలుగురోజులు అవతా ఉండాది. ఇక్కడొచ్చినాక భోజనానికి.. అన్నింటికి ఇబ్బంది పడ తా ఉండాం. సీరియల్‌ ప్రకారం ఎవరినీ పంపించడం లేదు. ఇబ్బంది పడుతున్నాం. రాత్రుల్లో ఈడే పడుకుంటాం.

– లోకనాథం, కొండ్రెడ్డిపల్లి, చిత్తూరు మండలం

లారీలను వదులుతున్నారు

గుడిపాలలోని ఫ్యాక్టరీ ల్లో లారీలు అప్పటికప్పుడు అన్‌లోడింగ్‌ అవుతోంది. లారీకి 25 టన్నుల కాయలు పడుతుంది.. ట్రాక్టర్లు అన్‌లోడింగ్‌ కావాలంటే నాలుగు రోజులు అవుతోంది. ఒక్క అధికారి కూడా వచ్చి చూడడం లేదు.

– ధృవ, మహాసముద్రం, బంగారుపాళ్యం

వారం రోజులైతే ఎట్టా స్వామీ?

కాయలు తెచ్చి ఇప్పటికి ఐదు రోజులైంది. బుధవారం సాయంత్రం ఉన్నట్టుండి అన్‌లోడింగ్‌ ఆపేశారు. మా తోటలో 80 టన్నుల కాయలు అయ్యాయి. 40 టన్నుల కాయలు మట్టిపాలయ్యాయి. మిగిలిన కాయలను ఫ్యాక్టరీకి తోలాదమనుకుంటే.. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది. – సందీప్‌, కొట్రకోన, జీడీనెల్లూరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement