సరికొత్త బాట | - | Sakshi
Sakshi News home page

సరికొత్త బాట

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

కర్ణాటకలో గతంలోనే ప్రారంభం

ఏపీలో బైరెడ్డిపల్లి వరకు రోడ్డు సిద్ధం

మొగిలి ఘాట్‌లో పనులు పూర్తయితే తమిళనాడుకు ఓకే

వేగానికి

సుందరపాళ్య నుంచి బైరెడ్డిపల్లి మార్గంలో

మొదలైన రాకపోకలు

బైరెడ్డిపల్లి నుంచే బెంగళూరుకు..

కర్ణాటకలోని సుందరపాళ్య నుంచి బైరెడ్డిపల్లికి వాహనాల రాకపోకలు మొదలు కావడంతో ఇకపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి వాసులు బైరెడ్డిపల్లి జంక్షన్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎక్కారంటే నేరుగా బెంగళూరుకు వెళ్లొచ్చు. ఇక అన్నమయ్య జిల్లా వాసులు సైతం మదనపల్లి నుంచి పుంగనూరు మీదుగా పలమనేరుతో సంబంధం లేకుండా బైరెడ్డిపల్లి మీదుగా బెంగళూరుకు మార్గం ఏర్పడింది.

పలమనేరు : చైన్నె– బెంగళూరు 6 ట్రాక్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు కర్ణాటకలో శరవేగంగా పూర్తయ్యా యి. వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆ మార్గంలో టోల్‌గేట్లు సైతం పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే వారు వీకోట నుంచి 40 నిమిషాల్లో హొసకోటకు చేరుకుంటున్నారు. ఫేస్‌–2లో భాగంగా కర్ణాటకలోని సుందరపాళ్య నుంచి చిత్తూరు జిల్లా లో బైరెడ్డిపల్లి వరకు గురువారం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. మరో రెండు నెలల్లో బైరెడ్డిపల్లి నుంచి బేలుపల్లి, మొగిలి ఘాట్‌, బ లిజపల్లి వరకు పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు.

ఫేజ్‌–2లో శరవేగంగా పనులు

చైన్నె– బెంగళూరు మహానగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జిల్లాలోని పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో శరవేగంగా సాగుతున్నా యి. కౌండిన్యలోని ఎలిఫెంట్‌ జోన్‌ మినహా మిగిలిన చోట్ల పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి. ఇప్పటికే బైరెడ్డిపల్లి వద్ద నిర్మించే జంక్షన్‌ పనులు పూర్తయ్యాయి. దీంతో ఇక్కడి వరకు వాహనాల రాకపోకలు మొదలయ్యాయి.

పది ప్యాకేజీల్లో సాగుతున్న రోడ్డు పనులు

చైన్నె సమీపంలోని శ్రీపెరంబూదూర్‌ నుంచి బెంగళూరు సమీపంలోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా) భారత్‌మాల పరియోజన పథకం ద్వారా రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 90 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణంలో భాగంగా మూడు ఫేసుల్లో పనులు సాగుతున్నాయి. తొలిఫేస్‌లో కర్ణాటకలో 71 కిలోమీటర్ల పనులు పూర్తికాగా రెండు, మూడు ఫేస్‌లలో భాగంగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో పనులు జోరుగా సాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 91కి.మీల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తారురోడ్లు, కల్వర్టులు, అండర్‌పాస్‌ బ్రిడ్జిల నిర్మాణాలు సైతం దాదాపు పూర్తికావస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ హైవేలో మొత్తం బ్రిడ్జిలు 162, రైల్వేక్రాసింగ్‌లు 4, కల్వర్టులు 143, పెడిస్ట్రిన్‌ అండర్‌పాస్‌లు 52, వాహనాల అండర్‌పాస్‌లు 41, ఫ్లైఓవర్లు 17 నిర్మిస్తున్నారు. వచ్చే మూడు నాలుగు నెలల్లో బైరెడ్డిపల్లి నుంచి చిత్తూరు మీదుగా చైన్నెకి వాహనాల రాకపోకలు సాగే అవకాశం ఉంది.

ఏపీ ఎక్స్‌ప్రెస్‌

హైవేలో మొదలైన

రాకపోకలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement