లారీ ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Jun 27 2026 12:25 AM | Updated on Jun 27 2026 12:25 AM

● టీటీడీ విద్యా సంస్థల్లో పూర్తికాని ప్రవేశాల ప్రక్రియ ● మూడు విడతల్లోనూ 50 శాతం పూర్తి కాని వైనం ● అధికారుల నిబంధనలపై తల్లిదండ్రుల ఆగ్రహం

యాదమరి: మండలంలోని పెరుమాళ్లపల్లి వద్ద శుక్రవారం బైక్‌ను లారీ ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. పెరుమాళ్లపల్లికి చెందిన తులసి ఆచారి(60) స్థానికంగా వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో యాదమరి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో ఐవోసీఎల్‌ వద్ద చిత్తూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవేమి అడ్మిషన్లు సామీ!

తిరుపతి సిటీ: 2026–27 విద్యా సంవత్సరంలో టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో చేపట్టిన అడ్మిషన్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటి వరకు ఎస్వీ జూనియర్‌ కళాశాల, పద్మావతి జూనియర్‌ కళాశాలలో మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయినా 50 శాతం సీట్లు భర్తీ కాలేదు. రెండు కళాశాలల్లో 1750 సీట్లు అందుబాటులో ఉండగా సుమారు 47 వేల దరఖాస్తులు వచ్చాయి. మెరిట్‌ ప్రాతిపదికన తొలివిడత కౌన్సెలింగ్‌లో పూర్తి స్థాయి సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. అధికారులు అత్యుత్సాహంతో కఠిన నిబంధనలు విధించడంతో చాలా మంది విద్యార్థులు సీట్లు సాధించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. ఎస్వీ జూనియర్‌ కళాశాలలో అన్ని గ్రూపుల్లో 792 సీట్లు ఉండగా 43శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యా యి. ఇంకా 449 సీట్లు మిగిలిపోయాయి, పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో 968 సీట్లు ఉండగా 62 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ అధికారులు కఠిన నిబంధనలు పెట్టడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

నాలుగో విడత ప్రవేశాలే శరణ్యమా?

టీటీడీ జూనియర్‌ కళాశాలల్లో మూడు విడతల కౌన్సిలింగ్‌ పూర్తయినా 50 శాతం సీట్ల భర్తీ కాకపోవడంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. నాలుగో విడత ప్రవేశాలు చేపట్టా లా? స్పాట్‌ అడ్మిషన్లతో సరిపెడతామా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ఉద్యోగం పేరుతో

రూ.2.16 లక్షల మోసం

తిరుపతి క్రైం : ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.2,16,250 మోసం చేసిన ఇద్దరిపై తిరుపతి అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన కె.వెంకన్న (51) కుమారు డు బీటెక్‌ పూర్తి చేశాడు. అతనికి సురేష్‌ రాజ్‌ అనే వ్యక్తి పరియమయ్యాడు. తాను బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. బీటెక్‌ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని వెంకన్నను నమ్మించాడు. తర్వాత మమత శ్రీనివాస్‌ అనే మహిళ మొబైల్‌ నంబర్‌ ఇచ్చి సంప్రదించమని చెప్పాడు. ఆమెకు ఫోన్‌ చేయగా ఆమె తాను యాక్సెంచర్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని తెలిపి, వెంకన్న కుమారుడి రెజ్యూమ్‌ పంపించాలని కోరింది. అనంతరం ఉద్యోగ ప్రక్రియలో భాగమంటూ అప్లికేషన్‌ ఫీజు, ప్రాసెస్‌ ఫీజు, ఆఫర్‌ లెటర్‌ ఫీజు, బ్యాంక్‌ అకౌంట్‌ ఫీజు, క్లయింట్‌ ఆఫర్‌ లెటర్‌ ఫీజు, మెడికల్‌ ఫీజు, ఆఫర్‌ లెటర్‌ రీజెనరేషన్‌ ఫీజు తదితర పేర్లతో విడతల వారీగా డబ్బులు చెల్లించాలని కోరింది. దీంతో వెంకన్న కుమారుడు 10 విడతల్లో రూ.2,16,250లను మమ త శ్రీనివాస్‌ ఖాతాకు బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న అనంతరం ఆమె ఫోనన్‌కు స్పందించడం మానేసింది. సురేష్‌రాజ్‌ను సంప్రదించినా కాలయాపన చేస్తూ తప్పించుకోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగాల పేరుతో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు లేదా ఫోన్‌ నంబర్లకు డబ్బులు పంపవద్దని పోలీసులు సూచించారు. ప్రముఖ సంస్థలు ఉద్యోగాల కోసం వ్యక్తిగతంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయవని తెలిపారు. ఉద్యోగాల కు సంబంధించిన సమాచారాన్ని ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే నిర్ధారించుకోవాలని, ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌న్‌ లో లేదా 1930 సైబర్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ బాట గంగమ్మ గుడి వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 62,925 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,297 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది.దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement