వడమాలపేట (పుత్తూరు): మండలంలోని కాయం చెరువులో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహం బయటపడడం స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వడమాలపేట ఎస్‌ఐ హరీష్ మాట్లాడుతూ మృతుడు తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణ పట్టు గ్రామాని కి చెందిన మునస్వామి (40)గా తేలిందన్నారు. బట్ట లు ఇసీ్త్ర చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వడమాలపేట మండలంలో ని కాయం చెరువులో మృతదేహమై తేలాడన్నారు. మృతునికి భార్య, కుమారు డు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ హరీష్ తెలిపా రు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రస్థాయి
కబడ్డీ పోటీలు ప్రారంభం
భాకరాపేట : దివంగత వి.సిద్ధరామిరెడ్డి జ్ఞాపకార్థం భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను చిన్నగొట్టిగల్లు కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దండు కిషోర్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.40 వేల నగదు బహుమతి, రెండో స్థానానికి రూ.20 వేలు, మూడో స్థానానికి రూ.10 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.500 నమోదు రుసుం చెల్లించి తమ జట్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక జట్టులో ఆడిన క్రీడాకారులు మరొక జట్టులో పాల్గొనడానికి అనుమతి ఉండదని, అంపైర్ల నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 7569967760, 9177069693 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


