కాణిపాకం: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత శుక్రవారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అలాగే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బసవరాజ కూడా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.
జడ్జిలు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ బసవరాజకు స్వామివారి చిత్రపటాలు అందజేస్తున్న ఆలయ అధికారులు


