సీసీ ఫుటేజి మాయంపై హోంమంత్రి స్పందించరెందుకు? | - | Sakshi
Sakshi News home page

సీసీ ఫుటేజి మాయంపై హోంమంత్రి స్పందించరెందుకు?

Jun 26 2026 4:17 AM | Updated on Jun 26 2026 4:17 AM

– మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్న

నగరి : సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజి మాయంపై హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. గురువారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. హోం మంత్రికి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడానికి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడానికి, సోషల్‌ మీడియా పోస్టులపై స్పందించడానికి సమయం ఉందన్నారు. అయితే సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌, శవం మాయం, సీసీటీవీ ఫుటేజీ మాయం వంటి వాటిపై మాట్లాడడానికి ఆమెకు సమయం దొరక డం లేదన్నారు. ఈ కేసు విషయంలో ఆమె ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ఆమెకు లేదా అని ప్రశ్నించారు. మౌనం పాటించకుండా వాస్తవాలను మీడియా ముందు బహిర్గతం చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement