ప్రభుత్వ స్థలాన్ని దాదాపు చదును చేసేసిన కబ్జాదారులు ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడమే తరువాయి. స్థానికులు అధికారుల కు పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా చలనంలేదు. దీంతో గురువారం టీడీపీ నేతలు వచ్చి ఇక్కడ జరుగుతున్న కబ్జా పనులను పరిశీలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులంతా ధైర్యంగా కబ్జా పనులను అడ్డుకున్నారు. పనులను పర్యవేక్షిస్తున్న పచ్చ మూకలను తరుముకున్నారు. చేసే దేమీలేక అందరూ తోక ముడి చి వెళ్లిపోయారు. విషయం కలెక్ట ర్ దృష్టికి వెళ్లడంతో ఆయ న కూడా దీనిపై సీరియస్ అయినట్లు సమాచారం.


