కుళ్లుతున్న మామిడి | - | Sakshi
Sakshi News home page

కుళ్లుతున్న మామిడి

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

మామిడి ఫ్యాక్టరీల్లో సిఫార్సులు సెక్యూరిటీ సిబ్బందిదే హవా జపింగ్‌ నంబర్లు ఇస్తున్న వైనం సామాన్య రైతులకు తప్పని నిరీక్షణ కుళ్లిపోతున్న కాయలు

కాణిపాకం: జిల్లాలోని జీడీనెల్లూరు, గుడి పాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కార్వేటినగరం ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద సిఫార్సుల దందా కొనసాగుతోంది. ఒక్కొ ఫ్యాక్టరీ వద్ద రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు సిఫార్సు వాహనాలకు ప్రాధా న్యం ఇస్తున్నాయి. తద్వారా సాధారణ రైతుల ట్రాక్టర్లు నాలుగు రోజులకుపైగా అన్‌లోడింగ్‌ కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఎవరి రాజ్యం?

కొన్ని ఫ్యాక్టరీల వద్ద సెక్యూరిటీ సిబ్బందే పవ ర్‌ సెంటర్‌గా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి వాహనం ముందుగా లోపలికి వెళ్లాలో వారే నిర్ణయిస్తున్నారని, కూటమి నేతల సిఫార్సు ఉంటే వారికి తక్షణమే గేట్లు తెరుచుకుంటున్నాయని రైతులు మండిపడుతున్నారు. ప్రధానంగా గంగాధర నెల్లూరులో ని ఓ ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది వరుస నంబర్లు ఇచ్చే క్రమంలో చేతివాటం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామా న్య రైతులను మాత్రం క్యూ కట్టించి నరకం చూపిస్తున్నారని వాపోతున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సిఫార్సుల ప్రభావం తగ్గలేదని అంటున్నారు.

తమిళనాడు కాయల ప్రవాహం

గుడిపాల సరిహద్దు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వద్ద తమిళనాడు నుంచి వచ్చే మామిడి కాయ లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని మరో ఫ్యాక్టరీ వద్ద సెక్యూరిటీ సిబ్బంది రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాయ లు కొనుగోలు చేయకుండా నేరుగా జీడీనెల్లూరుకు వెళ్లమని సూచించడంతో వందలాది ట్రాక్టర్లు అక్కడికి తరలివెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడు కాయలు 50పైగా లారీలు క్యూకడుతున్నాయి. ఇదీ ఫ్యాక్టరీలకు..అక్కడి వ్యా పారులకు సర్దుబాటు ఉందని, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని పలు పల్ప్‌ ఫ్యాక్టరీల్లో సిఫార్సులు రాజ్యమేలుతున్నాయి. కొందరు కూటమి నేతలు సిఫార్సుల దందాను దర్జాగా నడిపిస్తున్నారు. నేరుగా ట్రాక్టర్లను ఫ్యాక్టరీ లోపలికి పంపించి అన్‌లోడింగ్‌ చేయిస్తున్నారు. వారికి ఫ్యాక్టరీల సెక్యూరిటీ సిబ్బంది సహకరిస్తున్నారు. సామాన్య రైతుల కాయలను రోడ్డుపైనే నిలబెడుతున్నారు. ట్రాక్టర్లలోనే కాయలు కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చిత్తూరు నగరంలోని పళ్ల గుజ్జు ఫ్యాక్టరీ కాయలు కొనుగోలుకు పంగనామాలు పెడుతోందని రైతులు గుర్రుమంటున్నారు. తవణంపల్లిలోని ఓ ఫ్యాక్టరీలో అన్‌లోడింగ్‌ ఆలస్యమవ్వడంతో ట్రాక్టర్లలోనే నిలిచిపోతున్నాయి. తవణంపల్లిలోని మరో ఫ్యాక్టరీ టోకన్లు, వరుస నంబర్లు ఇవ్వకుండా గందరగోళం నడుమ కాయలను అన్‌లోడింగ్‌ చేయిస్తోంది. టీడీపీ నేతల సిఫార్సులుంటే ఆ బండ్లను ముందు వరుసలో నిలబెడుతోంది. చిత్తూరు మండలం చెర్లోపల్లిలోని ఫ్యాక్టరీ గత ఏడాది బిల్లులు ఇవ్వలేదని, ఈసారి కొనుగోలుకు బ్రేకు వేసిందని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో సిఫార్సుల వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని, ప్రతి రైతుకు సమాన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శక విధానం అమలు చేయకపోతే ఐక్యంగా ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement