పాఠశాల స్థాయిలోనే ఐచ్ఛిక సెలవులు అమలవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్థాయిలోనే ఐచ్ఛిక సెలవులు అమలవ్వాలి

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలోనే 2026–27 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఐచ్ఛిక (ఆప్షనల్‌ సెలవులు) అమలు కావాలని ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో ఒక యూనిట్‌గా సెలవుల ను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఏ ఉపాధ్యాయుడు కూడా ఐచ్ఛిక సెలవులను వ్యక్తిగత కారణాల కోసం విడిగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఐచ్ఛిక సెలవును పాఠశాల స్థాయిలో అమలు చేయాలనుకుంటే పర్యవేక్షణ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలోని డీవైఈవో, ఎంఈవోలు తమ పరిధిలోని పాఠ శాలలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించకుండా క్షేత్రస్థాయిలో తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రైతుల సమక్షంలోనే

రీ సర్వే నిర్వహించాలి

– సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌

నగరి : రైతుల సమక్షంలోనే రీ సర్వే నిర్వహించాలని, రీ సర్వేలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని సర్వే, భూరికార్డుల జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ టి.జయరాజ్‌ తెలిపారు. ఆయన బుధవారం మాంగాడు గ్రామంలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయన రీసర్వే చేస్తున్న విధానంపై రైతులను ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. ఈకేవైసీని స్వయంగా తనిఖీ చేసి గ్రామ సర్వేయరు, రెవెన్యూ అధికారి, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం నిండ్ర, నగరి మండలాలకు సంబందించిన పీజీఆర్‌ఎస్‌, ఎఫ్‌లైన్‌ పిటీషన్లను పరిశీలించా రు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సర్వే స ర్టిఫికెట్లను వెంటనే రైతులకు అందజేయాలని సూచించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, మండల సర్వేయర్‌ సురేష్‌, గ్రామ సర్వేయర్‌, వీఆర్వో, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

95 శాతం

సర్‌ ఫారాలు పంపిణీ

శాంతిపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)లో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారం–2 పంపిణీని 95 శాతం పూర్తి చేశారు. మొత్తం 2,30,474 మంది ఓటర్లలో బుధవారం సాయంత్రం వరకూ 2,18,807 మందికి ఫారాలను బీఎల్వోలు, బీఎల్‌ఏలు అందజేసినట్టు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. వాటిని సరైన వివరాలతో నింపిన తర్వాత మళ్లీ బీఎల్‌వోలకు అందజేయడం ద్వారా తమ ఓటును కోల్పోకుండా చూడవచ్చని పేర్కొన్నారు. శాంతిపురం మండలంలో 48,760 మంది ఓటర్లలో 45,854 మంది, కుప్పం ఆర్బన్‌లో 39,984 మందికి గాను 39,898 మంది, కుప్పం రూరల్‌లో 58,904 మందిలో 55,232 మంది, గుడుపల్లిలో 36,015 మందిలో 34,776 మంది, రామకుప్పం మండలంలో 46,811 మంది ఓటర్లలో 43,047 మందికి ఎన్యూమరేషన్‌ ఫారం–2లను అందజేశారు. రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్‌ స్టేషన్ల వారి గా నియమించిన బీఎల్‌ఏలు, పార్టీ శ్రేణులు ఆయా ఫారాలను నింపడంలో సాయంగా నిలుస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్థలాలు మంజూరు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందని ఆశాఖ ఐజీ అంబేడ్కర్‌ తెలిపారు. ఆయన బుధవారం చిత్తూరులోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రూరల్‌, నగరి, బంగారుపాళ్యం, కార్వేటినగరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అద్దె భవ నాల్లో ఉందన్నారు. సొంత భవనాల్లో వాటిని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలో ఏప్రిల్‌– జూన్‌ వరకు మొత్తం రూ.57.72 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు రూ.44.32 కోట్లు వసూలైందన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో కంటే జూన్‌లో ఆదాయం పెరిగిందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement