వార్డుల పునర్విభజనపై వచ్చిన 20 అభ్యంతరాలు సహేతుకంగా లేవని అధికారులు పట్టించుకోలేదు. ప్రతిపాదిత వార్డుల విస్తరణస్థానికుల భౌగోళిక పరిస్థితులు లెక్కచేయలేయకపోగా, డివిజన్లలో పౌరుల–ప్రజల భాగస్వామ్యాన్ని బలహీనపరచేలా ఉంది. పైగా విభిన్న సామాజిక–ఆర్థిక పరిస్థితులపై సంప్రదింపులు జరపలేదు. కొత్త జనాభా లెక్కలే తీయకుండా బీసీ ఓటర్లను ఎలా గుర్తిస్తారు. 60 డివిజన్లుగా ఇష్టానుసారంగా మార్చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు మారిపోతాయి. అందుకే మా పార్టీ తరపున పోరాటం చేశాం. విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది.
– ఎంసి.విజయానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త


