అంతర్రాష్ట్ర కిడ్నాప్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర కిడ్నాప్‌ ముఠా అరెస్ట్‌

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

రూ.22 లక్షలు, మూడు కార్లు స్వాధీనం పోలీసు సంకెళ్లు, నకిలీ పోలీసు ఐడీ కార్డులు సీజ్‌

పలమనేరు: కేరళ పోలీసులమంటూ పలమనేరు సమీపంలో హల్‌చ్‌ల్‌ చేసి ఆన్‌లైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడర్‌ ఎంసీ రవి అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ డేగల ప్రభాకర్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంగవరానికి చెందిన ఎంసీ రవి పలుదేశాల్లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నాడు. బెంగళూరులో ఉంటూ తరచూ ఇక్కడికి వచ్చి వెళుతుంటాడు. ఈనేపథ్యంలో ఈ నెల 7న తన స్వగ్రామంలో జరిగిన గంగజాతరకు వచ్చి స్నేహితులతో కలిసి పలమనేరు మండలంలోని ఓ మామిడి తోటలో విందు పెట్టుకున్నారు. కొందరు పలమనేరు పట్టణ సమీపంలోని టి.వడ్డూరు వద్ద అతని కారును అడ్డగించి కేరళ పోలీసులమంటూ కారులోకి ఎక్కించుకుని బేడీలు వేసి తీసుకెళ్లారు. అతని సెల్‌ఫోన్‌లోని సిమ్‌ను తీసేశారు. రూ.రెండు కోట్లు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబ సభ్యులకు వేరే ఫోన్ల తో మాట్లాడించారు. ఈ నెల 8న చిక్‌బళ్లాపూ ర్‌ హైవేలో బాధితుని బంధువు నుంచి రూ. కోటి నగదు తీసుకున్నారు. బాధితుడు మెడలో ఉన్న 900 గ్రాము ల బంగారు చైన్లను లాక్కుని అతన్ని వదిలిపెట్టి కార్లలో ఉడాయించారు. దీనిపై బాధితుడు ఈ నెల 12న స్థానిక పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారా లు, సీసీటీవీ పుటేజీలు, కాల్‌డేటా, వాహనా ల కదలికల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.

ఆర్థిక లావాదేవీలే కారణం

కేరళ రాష్ట్రానికి చెందిన రోషన్‌ గ్యాంగ్‌ ఏపీ, తెలంగాణా వారితో కలిసి కిడ్నాప్‌ చేసినట్టు గుర్తించారు. పలమనేరు కోర్టులో ఓ ఐపీ కేసుకు సంబందించి రవికి, సంకరి మహేష్‌ నాయుడుకు మధ్య వివాదం ఉంది. ఈ క్రమంలో మహేష్‌నాయుడు ఏలూరు జిల్లా ద్వారక తిరుమలకు చెందిన భానుప్రకాష్‌ను సంప్రదించాడు. అతను కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాఽగేశ్వర్‌రెడ్డి (ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా చెప్పుకొనే) కలిసి రవి కిడ్నాప్‌నకు పథకం వేసినట్టు తేలింది. దీంతో నాగేశ్వర్‌రెడ్డి కేరళకు చెందిన రోషన్‌ వర్గీస్‌ ముఠాను సంప్రదించి సొంతూరులో పండక్కి వచ్చిన రవిని కేరళ పోలీసులమంటూ ఆరు కార్లలో వచ్చిన 25 మంది రోడ్డుపైనే పట్టపగలే కిడ్నాప్‌ చేశారు.

11 మంది నిందితుల అరెస్ట్‌

ఈ కేసులో కేరళకు చెందిన అప్పు అరుణ్‌, ఎడ్విన్‌ థామస్‌, దీపుమోన్‌, నితిన్‌జానీ, అభయ్‌, రతీష్‌, లిబిన్‌, కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన ఉప్పలూరు నాగేశ్వర్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన పందేళ్లపల్లి రామిరెడ్డి, గుండ్రా మహేశ్వర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రం పనపర్తి జిల్లాకు చెందిన సుంకరి మహేష్‌ నాయుడును అరెస్ట్‌ చేశారు. వీరినుంచి మూడు కార్లు, రూ.22 లక్షల నగదు రికవరి చేశారు. పోలీసుల హ్యాండ్‌ కప్స్‌, 12 మొబైల్‌ ఫోన్లు, పోలీసుల నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కేరళకు చెందిన రోషన్‌ వర్గీస్‌, సచూ, అనూప్‌, నికిల్‌మోహన్‌, స్వాజి, అరుణ్‌, సామ్‌, అమీన్‌, ద్వారకా తిరుమలకు చెందిన భానుప్రకాష్‌, పులివెందులకు చెందిన ప్రణీత్‌రెడ్డి, జస్వంత్‌, అనిల్‌, కృష్ణారెడ్డి, మరో వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. రవి ఇక్కడే ఉన్నాడనే సమాచారం ఇచ్చిన వారిపై కూడా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్‌ కేసులోని ప్రధాన నిందితుడు రోషన్‌పై కేరళలో హత్యాయత్నాలు, దాడులు, బెదిరింపులు, పేలుడు పదార్థాల సరఫరా, ఎస్‌డీపీఎస్‌ తదితర 21 కేసులు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక సింహాద్రిపురం నాగేశ్వర్‌రెడ్డిపై ఏపీలోని పలుచోట్ల 15 క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు గుర్తించారు. అంతర్రాష్ట్ర కిడ్నాప్‌ ముఠా కేసును ఛేదించిన పలమనేరు సీఐ మోహన్‌రెడ్డి టీమ్‌లోని సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ లోకేష్‌రెడ్డి, పీసీలు గణేష్‌, నరేష్‌, భాస్కర్‌, శశికుమార్‌ను డీఎస్పీ అభినందించారు.

కేరళ పోలీసులమంటూ కిడ్నాప్‌ చేశారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement